Karnataka Budget: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.200లకే సినిమా టికెట్ ధర
ఈ వార్తాకథనం ఏంటి
2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
మొత్తం రూ.4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభ ముందు ఉంచారు. ఈసారి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినీ పరిశ్రమ ప్రమోషన్‌లు, మహిళా సాధికారిత వంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
సినీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయాలను కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది.
సినిమా టికెట్ ధరను రూ.200గా నిర్ణయించాలని భావిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.
మల్టీప్లెక్స్‌లు సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఈ రేటు వర్తిస్తుందని తెలిపారు.
సామాన్య ప్రజలు కూడా సినిమాలను తక్కువ ఖర్చుతో వీక్షించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
వివరాలు
మైసూరులో ఫిల్మ్ సిటీ
అంతేకాకుండా, కన్నడ సినిమాలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూరులో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం రూ.500 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.