
Ex DGP murder case: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య..కారం పొడి చల్లి.. కట్టేసి..వెలుగులోకి మరిన్ని విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (వయస్సు 68) దారుణంగా హత్యకు గురైన సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.
ఆస్తి సంబంధిత వివాదాలు,కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజాగా ఈ కేసుతో సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల వెల్లడి ప్రకారం,ఆదివారం మధ్యాహ్న సమయంలో ఓం ప్రకాశ్,ఆయన భార్య పల్లవి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది.
దాంతో పల్లవి తన భర్తపై కారప్పొడి చల్లి,అతడిని కట్టేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తరువాత ఆమె ఓ గ్లాస్ బాటిల్‌ను ఆయుధంగా ఉపయోగించి అతడిని దారుణంగా పొడిచి హత్య చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
ఓం ప్రకాశ్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
ఘటన అనంతరం, నిందితురాలు మరో పోలీసు ఉన్నతాధికారికి చెందిన మహిళతో మాట్లాడి, "తానే తన భర్తను చంపినట్లు" అంగీకరించిందని సమాచారం.
ఓం ప్రకాశ్ 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన బిహార్‌లోని చంపారన్ ప్రాంతానికి చెందినవారు.
2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2017లో పదవీ విరమణ చేశారు.
పదవీ విరమణ అనంతరం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివాసముంటున్నారు.
పల్లవి అందించిన సమాచారంతో పోలీసులు వారి నివాసానికి చేరుకున్న సమయంలో, ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు.
వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.