తదుపరి వార్తా కథనం

DK Shivakumar: సార్వత్రిక ఎన్నికల వేళ షాక్ .. డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసు
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 11, 2024
09:27 am
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
డీకే శివకుమార్‌పై ఇప్పటికే విచారణలో ఉన్న అక్రమ ఆస్తుల సంపాదన,అక్రమ నగదు బదిలీ కేసులో సీబీఐకి సమర్పించిన పత్రాలను సమర్పించాలని డీకే శివకుమార్‌కు ఇచ్చిన నోటీసులో లోకాయుక్త కోరింది.
1 ఏప్రిల్ 2013 నుండి 2018 వరకు ఏప్రిల్ 30వ తేదీ వరకు డీకే శివకుమార్ సంపాదించిన ఆస్తుల వివరాలను తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ఆదాయానికి మించి రూ.74.93 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని డీకే శివకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.