Page Loader
మళ్లీ వివాదంలో కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్.. వివాహ వేడుకలో నోట్ల వర్షం
వివాహ వేడుకలో నోట్ల వర్షం

మళ్లీ వివాదంలో కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్.. వివాహ వేడుకలో నోట్ల వర్షం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 19, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక చెరుగు సాగు శాఖ మంత్రి శివానంద పాటిల్ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు. గుల్బర్గా కాంగ్రెస్ నేత అయాజ్ ఖాన్ కుమారుడికి,హైదరాబాద్ కు చెందిన వ్యాపారి,రెడ్ రోజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సయ్యద్ హమీద్ ఉద్దీన్ కుమార్తెతో ఘనంగా వివాహం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన వేడుకలో పాటిల్ సహా మరికొందరు మంత్రులు పాల్గొన్నారు. పాటిల్ సోఫాలో కూర్చోగా, ఆయన చుట్టు అలాగే పాదాల వద్ద కరెన్సీ నోట్లు ఉన్నాయి. యువత గాల్లోకి రూ.500 నోట్లు వెదజల్లుతూ సంబురాలు జరుపుకున్నారు. దోచుకున్న డబ్బుతో ఆనందిస్తున్న తీరును మంత్రి శివానంద పాటిల్ మంచిగా చూపించారని కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసింది. నోట్లను వెదజల్లింది తాను కాదని, పెళ్లిలో జరిగిందని పాటిల్ వివరణ ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి సమక్షంలో నోట్లు వెదజల్లిన యువత

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రజా ధనాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పని: బీజేపీ