
Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి
ఈ వార్తాకథనం ఏంటి
28 ఏళ్ల వివాహితను తన వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన ఆరోపణలపై కర్ణాటకలో ఒక జంట సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇండియా టుడే నివేదిక తెలిపింది.
తన భార్య ఎదుటే ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని, బుర్ఖా ధరించి, నుదుటిపై నుంచి కుంకుం తీసేయమని ఒత్తిడి చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం,రఫిక్ అనే నిందితుడు మహిళను మోసగించి ఆమెతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు.
అతను ఆమె ఫోటోలను తీసి, బ్లాక్ మెయిల్ చేసాడు. బాధితురాలిని మతాన్ని మారమని కూడా కోరాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
కర్ణాటక
బుర్ఖా ధరించి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని బలవంతం
2023 నుంచి తాము ముగ్గురం కలిసే ఉంటున్నామని బాధితురాలు పేర్కొంది. తాము చెప్పిందల్లా వినాలని ఒత్తిడి చేశారని పేర్కొంది.
రఫిక్ తన భార్య ఎదుటే తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. నివేదిక ప్రకారం, బెలగావి ఎస్పీ భీమశంకర్ గులేడ మాట్లాడుతూ, రఫిక్ దంపతులు ఆ మహిళను 'కుంకుమ' ధరించవద్దని కోరారని, బుర్ఖా ధరించి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయమని బలవంతం చేశారని తెలిపారు.
తనపై కులపరమైన వ్యాఖ్యలు చేశారని, వెనుకబడిన కులానికి చెందినందున తప్పక మతం మారాలని నిందితులు చెప్పారని ఆ మహిళ కూడా ఆరోపణలు చేసిందన్నారు.
ఇస్లాం
ఏడుగురిపై సౌందట్టిలో ఎఫ్‌ఐఆర్ నమోదు
తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఆ వ్యక్తి తనపై ఒత్తిడి తెచ్చి బెదిరించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
తాను ఇస్లాంలోకి మారకుంటే చంపేస్తామని ఆ జంట బెదిరించారని కూడా ఆమె ఆరోపించింది.
మహిళ ఫిర్యాదు ఆధారంగా ఏడుగురిపై సౌందట్టిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు నివేదిక పేర్కొంది.
కర్ణాటక మతస్వేచ్ఛ చట్టం, ఐటీ చట్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.