తదుపరి వార్తా కథనం

Vijay: కరూర్ ర్యాలీ విషాదం.. విజయ్ పర్యటన రద్దు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 01, 2025
03:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు, స్టార్ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన రాజకీయంగా ప్రతికూల ప్రతిస్పందనలు కలిగించింది. అధికార డీఎంకే పార్టీ విజయ్ ర్యాలీ, నియమాలను ఉల్లంఘించినట్టు ఆరోపించగా, విజయ్ పార్టీ డీఎంకే కుట్ర ఉందని ఆరోపిస్తూ స్వతంత్ర లేదా సీబీఐ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేసింది. వీటితోపాటు, ఈ విషాదకర ఘటన తరువాత విజయ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను రద్దు చేశారు. తొక్కిసలాట తర్వాత ర్యాలీలపై విమర్శలు పెరిగడంతో, టీవీకే పార్టీ రెండు వారాల పాటు తన పర్యటనలను నిలిపివేసే నిర్ణయం తీసుకుంది