తదుపరి వార్తా కథనం

Kerala: బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్‌ఫెక్షన్‌తో కేరళ వ్యక్తి మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 23, 2024
04:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని కాసర్‌గడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మణికందన్ అనే వ్యక్తి బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba Infection) వ్యాధితో మరణించాడు.
కన్నౌరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అతను అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆదివారం సాయంత్రం అతను కన్నుమూశాడు. బాధితుడు ముంబైలో పనిచేస్తున్నాడు, కానీ జ్వరం రావడంతో తన ఇంటికి తిరిగి వచ్చాడు.
కాసర్‌గడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అతను చికిత్స తీసుకున్నాడు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ పరీక్ష ఆధారంగా, అతనికి అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ ఉన్నట్లు గుర్తించారు.
అమీబిక్ పీసీఆర్ పరీక్ష ద్వారా దీనికి సంబంధించి పూర్తి నిర్ధారణ కూడా చేయనున్నారు.