LOADING...
Kavitha: పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

Kavitha: పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై అర్థం లేకుండా వ్యాఖ్యలు చేస్తే, అది అతనికే సమస్య అవుతుందంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటు హెచ్చరిక చేశారు. "నిరంజన్ గారు తండ్రి వయసు వారు కాబట్టి ఇప్పటికీ గౌరవం చూపిస్తున్నా... కానీ గీత దాటేలా మాట్లాడితే మాత్రం నేనూ నిశ్శబ్దంగా ఉండను" అని కవిత స్పష్టం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తిలో పర్యటించి, అక్కడ మీడియాతో మాట్లాడుతూ నిరంజన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతంలో ఎదురవుతున్న నష్టాలకి నిరంజన్ రెడ్డే కారణమని, మూడు సార్లు వరుసగా 32 మంది బీసీ వర్గాలపై అన్యాయంగా కేసులు పెట్టించిన వ్యక్తి ఆయనేనని కవిత విమర్శించారు.

వివరాలు 

మీరు అప్పట్లో ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు

నిరంజన్ రెడ్డి మూడు ఫార్మ్ హౌజులు నిర్మించుకున్నారని, కష్టపడి సంపాదించి కట్టుకుంటే వేరేమాట... కానీ కృష్ణా నది తీరాన్ని అక్రమంగా ఆక్రమించుకుని ఆ నిర్మాణాలు చేశారని ఆరోపించారు. "ఈ విషయాలు కేసీఆర్ గారికి తెలియవా? లేక హరీష్ రావు గారి మనిషిగా చెబుతూ అసలు సమాచారాన్ని దాచిపెడుతున్నారా?" అని కవిత ప్రశ్నించారు. చిన్న పిల్లాడు అడిగినా చెప్పేంత స్పష్టంగా నిరంజన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి తనపై అనవసరంగా మాట్లాడటం ఎలా సహించగలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు అప్పట్లో ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు... ఆ విషయం కేసీఆర్ గారికి తెలిసి కూడా క్షమిస్తే అది తప్పేనన్నారు. "

వివరాలు 

పెబ్లేరు సంత చాలా ఫేమస్

వ్యవసాయ శాఖలో పనిచేసే మంత్రి స్థాయిలో ఉంటూ ప్రజలకు రక్తం తాగేలా ప్రవర్తిస్తున్నారా అంటూ కవిత ప్రశ్నించారు. ఎదుల రిజర్వాయర్ కూడా పూర్తిగా నిర్మించకపోయినా, తనే 'నీళ్ల నిరంజన్ రెడ్డి'గా చెప్పుకోవటం హాస్యాస్పదమని ఆరోపించారు. జిల్లాలో ఒక ఎకరాకు కూడా కొత్తగా నీళ్లు ఇవ్వకపోయి, పాత కనెక్షన్లకే నీళ్లు ఇచ్చి పేరును సొంతం చేసుకోవడం సరైంది కాదన్నారు. పెబ్బేరు సంత చాలా ప్రసిద్ధి అని, అక్కడ 32 ఎకరాలు నిరంజన్ రెడ్డి అనుచరులు ఆక్రమించి విక్రయాలకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. వనపర్తి-పెబ్బేరు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కబ్జాలే కనబడుతున్నాయా? నిరంజన్ రెడ్డి భూదాహానికి అంతేలేదని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.

వివరాలు 

వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే సహించను

ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ అయినా ప్రోత్సహించకూడదని, ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ జిల్లా స్థాయిలో నిలబడలేదని కవిత హెచ్చరించారు. హరీష్ రావు మనిషి అన్న కారణంతోనే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. "నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే సహించను" అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి చేస్తున్న చర్యలు తెలియవని భావించడంతోనే మీడియా ద్వారా ఈ విషయాలను చెప్పాల్సి వస్తోందన్నారు. ఇలాంటి వారిని ప్రజలపై రుద్దటం పూర్తిగా అన్యాయం అని అన్నారు.

వివరాలు 

ఆర్&ఆర్ కాలనీ ఇప్పటివరకు నిర్మించలేదు 

తెలంగాణ కోసం బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులే ప్రధాన కారణమని, కానీ ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఆ పనులు పూర్తవలసినంతగా జరగలేదని కవిత పేర్కొన్నారు. 2004-2005ల్లోనే ప్రజల భూములు తీసుకున్నా, వారికి ఆర్&ఆర్ కాలనీ ఇప్పటివరకు నిర్మించలేదని విమర్శించారు. పైగా అనుమతి లేకుండా గేట్లు ఎత్తేస్తుండటంతో అర్థం గ్రామాల్లోకి నీరు చేరుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రావుల చంద్రశేఖర్ రావు గారు నిజాయితీ గల వ్యక్తి, అవినీతి మరక లేని నాయకుడు అని చెప్పిన కవిత, ఆయన ఈ సమస్యలను కేసీఆర్ గారికి వివరించి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కనీసం ఇప్పుడు అయినా స్థానికుల కోసం ముందుండి పోరాడాలని విజ్ఞప్తి చేశారు.