
Kavitha : కేసీఆర్ ఫొటో లేకుండా 'జాగృతి జనం బాట' పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళుతున్నానని ఆమె చెప్పారు. 'జాగృతి జనం బాట' పేరుతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో యాత్రకు కవిత సిద్ధమయ్యారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె యాత్ర వివరాలను పంచుకున్నారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ "జాగృతి జనం బాట" యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. కవిత మాట్లాడుతూ,"నేను ప్రజల దగ్గరకు వెళ్ళి వారు ఏం అనుకుంటున్నారో,వారి సమస్యలు ఏమిటో తెలుసుకుంటాను.కేసీఆర్‌కు బీఆర్ఎస్,తెలంగాణ జాగృతి రెండు కళ్లలా పనిచేశాయి.ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో,కేసీఆర్ ఫొటో పెట్టి వెళ్ళితే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తుంది.అందువల్ల నైతిక కారణాలతో ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నాను" అని పేర్కొన్నారు.
వివరాలు
తెలంగాణ జాగృతి యాత్రకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధం లేదు
రాజకీయ పార్టీకి అవకాశం ఉందా..? లేదా?.. పార్టీ పెట్టవచ్చా లేదా అనేదిప్రజలను అడిగి తెలుసుకుంటాం. తన రాజీనామాను ఆమోదించాలని పదేపదే కోరుతున్నట్లు చెప్పారు. "పార్టీ నన్ను వద్దు అనుకుంటే, ఎమ్మెల్సీ పదవీ ఎందుకు కావాలి?" అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంటో అర్ధం కావడం లేదు. . నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమోనని కవిత పేర్కొన్నారు. జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, వైఫల్యం చెందాయని, అందుకే తెలంగాణ మొత్తం యాత్ర చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చిన్న విషయం మాత్రమే; అది తెలంగాణ జాగృతి యాత్రకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రజాస్వామ్యంలో అసలు గురువులు ప్రజలే..
కవిత తెలిపిన వివరాల ప్రకారం, యాత్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటామని, అన్ని వర్గాల ప్రజలతో కలసి మాట్లాడతామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ప్రజల నుండి సూచనలు, అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. "సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు, విధానమని" వివరిస్తూ, తాము యాత్రలో ఉన్నంత కాలం సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసలు గురువులు ప్రజలే అని గుర్తు చేశారు. పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంటిలో కూర్చోపెట్టారని పేర్కొన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటామని అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'జాగృతి జనం బాట' పోస్టర్
తెలంగాణ జాగృతి భవన్లో జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. pic.twitter.com/daczTFI3Tz
— Jagruthi Talks (@jagruthi_Talks) October 15, 2025