Page Loader
MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం
కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం

MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఎమ్ఎల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం అవ్వడంతో, రాష్ట్ర రాజకీయాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన నూతన కార్యాలయం త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పనిచేస్తున్న ఇందిరా పార్క్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేయనున్నారు.

Details

సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లో, ఎమ్ఎల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యాచరణ కోసం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పూజ ముగిసిన తర్వాత, ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి తరపున కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేయడం, జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద జరగనున్న ధర్నా గురించి ఈ కొత్త కార్యాలయంలో ప్రసంగించే అవకాశం ఉంది. కే సీఆర్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి తరఫున పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు.