తదుపరి వార్తా కథనం

Gaddam Srinivas Yadav: బిఆర్ఎస్ హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఖరారు.. 17 స్థానాలకు నామినేషన్‌ను పూర్తి
వ్రాసిన వారు
Stalin
Mar 25, 2024
05:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్‌ను అభ్యర్థిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
ఏఐఎంఐఎం అధ్యక్షుడు,ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ,బీజేపీ నుంచి మాధవి లతపై ఆయన పోటీ చేయనున్నారు.
ఈ ప్రకటనతో తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు బీఆర్‌ఎస్ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది.
అయన 2021లో BRSలో చేరారు.అయన 2023లో గోషామహల్ అసెంబ్లీ స్థానానికి BRS టికెట్ ఆశించారు. కానీ, రాజా సింగ్ చేతిలో ఓడిపోయిన నంద్ కిషోర్ వ్యాస్‌ను పార్టీ నామినేట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. pic.twitter.com/DGPstMg4b8
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2024