NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు
    తదుపరి వార్తా కథనం
    Kcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు
    ఇకపై Y కేటగిరికి కుదింపు

    Kcr Security : కేసీఆర్'కు Z PLUS సెక్యూరిటీ తొలగింపు.. ఇకపై Y కేటగిరికి కుదింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 15, 2023
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్'కు భద్రతను కుదించింది.

    ఇప్పటి వరకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత(Z PLUS SECURITY)లో ఉన్న కేసీఆర్'కు ఇక నుంచి Y కేటగిరీ భద్రతను అందించనున్నారు.

    ఈ మేరకు వై కేటగిరీ భద్రత కింద 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు, ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్'కు సంబంధించి ఒక వాహనాన్ని సైతం అందిస్తారు.

    మంత్రులుగా పని చేసి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల ఛైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు.

    DETAILS

    మాజీ మంత్రులకు తగ్గిన భద్రత

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

    ఇందులో భాగంగానే ప్రముఖుల సెక్యూరిటీపైనా సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీల్లో భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్ మెన్లను ఇచ్చే అవకాశం ఉంది.

    వీరికి సంబంధించి పూర్తిగా మరోసారి సమీక్ష అనంతరమే గన్ మెన్ల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    మాజీలకు సైతం తప్పదు :

    ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులకు 2+2 గన్ మెన్లను కేటాయించింది.ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు గన్‎మెన్లను పోలీసు శాఖ అలాట్ చేయనుంది.

    ఇదే సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో భద్రతను గతంలో లాగే యథావిధిగా కొనసాగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్  తెలంగాణ
    తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్.. రూ.లక్ష కోట్ల కోసమే ఆర్టీసీ విలీనమని ఆరోపణ బీజేపీ
    ఏ పార్టీకి పిండం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు; కాంగ్రెస్‌పై కేసీఆర్ ఫైర్   తెలంగాణ
    గ్రూప్‌-2 కొత్త షెడ్యూల్ రిలీజ్.. నవంబర్‌ తొలి వారంలోనే పరీక్షలు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025