
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు..గోవా పర్యటనకు కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది.
జవవరి 18న తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే మరోసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దేశ రాజధానిలో విద్యా శాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాలో మూడు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు.
గోవా పర్యటనలో రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆప్ తన కార్యాచరణ రూపొందిస్తోంది.
Details
జనవరి 3న కూడా ఈడీ సమన్లను దాటేసిన కేజ్రీవాల్
కేజ్రీవాల్ గతంలో జనవరి 3న కూడా ఈడీ సమన్లు దాటేశారు.తనను అరెస్టు చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లు "చట్టవిరుద్ధమైనవి", "రాజకీయ ప్రేరేపితమైనవి" అని ఆరోపించారు.
అంతకముందు, కేజ్రీవాల్ నవంబర్ 2,డిసెంబరు 21 న రెండు సందర్భాలలో ప్రోబ్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి నిరాకరించారు.
ఈ సంబంధిత కేసులో, సీనియర్ ఆప్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ కూడా అరెస్టయ్యారు.