Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ వినతి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తాత్కాలిక బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు. మరో ఏడు రోజులకు బెయిల్ ఇవ్వాలని విన్నవించారు. PET-CT scan చేయించుకోవాలని , కీటోన్ లెవల్స్ పరీక్షకు అనుమతించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జైలులో వున్నప్పుడు ఏడు కేజీల బరువు తగ్గానని దీనికి సంబంధించి వైద్య పరీక్షలు అవరమన్నారు. 21 రోజులకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది . ఆ గడువు జూన్ 1తో ముగుస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారానికి బెయిల్ కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అంతకు ముందు కోరారు.
ఏమిటీ ఇంత ప్రాధాన్యత?
మనీ లాండరింగ్ కేసులో ED మార్చి 21 న అరెస్ట్ చేసింది. పాత ఎక్సైజ్ విధానాన్ని రద్దు చేసిన ప్రక్రియపై ED ఆయనను అదుపులోకి తీసుకుంది. బెయిల్ పై వున్న రోజుల్లో అధికారిక విధులకు హాజరు కారాదని షరతు విధించింది. ఫైళ్లపై సంతకాలు చేయకూడదని ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా దేనిపై సంతకాలు వద్దంది సుప్రీం కోర్టు కొత్త పాలసీని తెచ్చే క్రమంలో అవకతవకలు జరిగాయని వ్యాఖ్యానించింది.
ఎక్సైజ్ పాలసీలో ఏముంది..
2021-22 మధ్య కాలానికి ఢిల్లీ సర్కార్ నవంబర్ లో ఎక్సైజ్ పాలసీ తెచ్చింది. కానీ ఏడాది ముగియగానే దానిని రద్దు చేసింది. మద్యం వ్యాపారుల సిండికేట్ కు 12 నుంచి 15 శాతం లాభాలు వచ్చేలా ఈ పాలసీలో మార్పులు తెచ్చింది. అర్హత లేని వ్యక్తులకు లాభాలు చేకూర్చేలా పాలసీ మార్చారని ED కేసు నమోదు చేసింది. అయితే ఈ వాదనను ఢిల్లీ సర్కార్ తోసి పుచ్చింది. మరింత ఆదాయం పెరుగుతుందని చెప్పుకొంది.