Page Loader
Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. అయితే జైలు నుండే ఆయన తన భార్య సునీతా కేజ్రీవాల్ ద్వారా ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు తన సందేశాన్ని తెలియజేశారు. ఈరోజు సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీత కూర్చున్న చోట భగత్ సింగ్, డా.భీంరావ్ అంబేద్కర్ చిత్రాల మధ్య కేజ్రీవాల్ చిత్రాన్ని ఉంచారు. ప్రజలకు సందేశం ఇస్తూ, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి ఎమ్మెల్యేలందరికీ సందేశం పంపారని అన్నారు.

Details 

ఢిల్లీ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు 

ఢిల్లీ వాసులు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, ప్రతి ఎమ్మెల్యే ప్రతిరోజూ వారి వారి ప్రాంతానికి వెళ్లి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే అడగాలని అన్నారు. "ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించండి, నేను ప్రభుత్వ శాఖల సమస్యలను మాత్రమే పరిష్కరించడం గురించి మాట్లాడడం లేదు, ఇతర ప్రజల సమస్యలను కూడా పరిష్కరించాలి. ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమని, నా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, దేవుడు అందరినీ ఆశీర్వదించాలి"అని ఆయన అన్నారు.

Details 

ఏప్రిల్ 15 వరకు జైలులోనే ..

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 2 గంటల ప్రశ్నల తర్వాత మార్చి 21న ఈడీ అయన ఇంటి నుండి అరెస్టు చేసింది. కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 15 వరకు అరవింద్ కేజ్రీవాల్ జైలులోనే ఉంటారని.. ఆయన కుటుంబ సభ్యులు, ముగ్గురు స్నేహితులను జైలులో కలిసేందుకు అనుమతించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రెస్ కాన్ఫరెన్స్ లో సునీతా కేజ్రీవాల్