Page Loader
Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ
Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2024
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని అధికార బీజేడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరారు. తానూ మానసిక స్థైర్యాన్ని కోల్పోయానని, కాబట్టి క్రియాశీల రాజకీయాలలో కొనసాగలేనని సీఎం నవీన్ పట్నాయక్ కు పంపిన రాజీనామా లేఖలో మొహంతి పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సొంత నియోజవర్గం కేంద్రపారలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారికి తన సేవలు అందిస్తానని తెలిపారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో మొహంతి కాషాయ కండువా కప్పుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీలో చేరుతున్న అనుభవ్ మొహంతి