Page Loader
Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష 
కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష

Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2024
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని అలప్పుజాలో స్థానిక బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేసినందుకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 15 మంది సభ్యులకు మంగళవారం మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మరణశిక్ష విధించింది. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్,డిసెంబర్ 19,2021న అతని ఇంటిలోనే దారుణంగా హత్య చేశారు. అంతకుముందు జనవరి 20న మావెలిక్కరలోని అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో నిందితులందరినీ దోషులుగా నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం,అదే ఏడాది డిసెంబర్ 18న SDPI రాష్ట్ర కార్యదర్శి KSషాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది. ఈ హత్యకు ప్రతీకారంగా కొద్ది గంటలలోనే రంజిత్‌ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష విధించిన కోర్టు