Loading...
Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు
4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు

Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. భార్యను ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకోవాలని వేధించడం, ఆమెను తీవ్రంగా హింసించడం, చివరకు నాలుగేళ్ల కుమార్తె ముందే అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. కేరళలోని మయ్యనాడుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి.. ఓ యువతిని దాదాపు పదేళ్లపాటు ప్రేమించి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. గత నాలుగేళ్లుగా కుటుంబం బ్రిటన్‌లో నివసిస్తోంది. ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే నిలిపివేసిన నిందితుడు.. మొదటి నుంచే అశ్లీల వీడియోలకు బానిసైనట్లు పోలీసులు తెలిపారు.

వివరాలు 

మానసిక వైద్యుడితో ప్రత్యేక కౌన్సిలింగ్

భార్యకు తెలియకుండా ఇంట్లోని పడకగది,స్నానాల గదిలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి ఆమెకు సంబంధించిన ప్రైవేట్ దృశ్యాలను చిత్రీకరించేవాడు.

అనంతరం ఆ వీడియోలను బ్రిటన్‌కు చెందిన కొన్ని అశ్లీల వెబ్‌సైట్లకు విక్రయించి డబ్బు సంపాదించేవాడని పోలీసులు తెలిపారు.

అయితే.. ఆ వెబ్‌సైట్లలో బాధితురాలికి సంబంధించిన వీడియోలను ఆమె స్నేహితులు గుర్తించి ఆమెకు సమాచారం ఇవ్వడంతో భర్త చేసిన దారుణం బయటపడింది.

తన భర్త చేసిన పని గురించి తెలుసుకున్న బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురైంది.

అయినప్పటికీ కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆగస్టు 14న భర్తతో కలిసి కేరళలోని కొల్లంకు తిరిగి వచ్చింది.

అతడి ప్రవర్తనలో మార్పు వస్తుందనే ఆశతో మూడు రోజులపాటు మానసిక వైద్యుడితో ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా ఇప్పించింది.

వివరాలు 

నాలుగేళ్ల కుమార్తె ముందే..

అయితే.. కౌన్సిలింగ్ అనంతరం కూడా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదని బాధితురాలు తెలిపింది.

పైగా.. ఇతర పురుషులతో గడపాలని భర్త తనను బలవంతం చేసేవాడని ఆమె ఆరోపించింది.

తాను స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నానని చెప్పినా అందుకు అంగీకరించకుండా తనపై విచక్షణారహితంగా దాడి చేసేవాడని పేర్కొంది.

కౌన్సిలింగ్ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో.. అతడు తన నాలుగేళ్ల కుమార్తె ముందే లైంగిక వికృత చేష్టలకు పాల్పడుతూ వాటిని వీడియోగా చిత్రీకరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

ఈ విషయాన్ని ప్రశ్నించిన తనను భర్త తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైనట్లు చెప్పింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొట్టియం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

నిందితుడిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు 

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కౌన్సిలింగ్ సమయంలో చిన్నారి చెప్పిన వివరాలను కూడా దర్యాప్తులో పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడిపై పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (POCSO) కింద కూడా నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

కేసు నమోదైన వెంటనే నిందితుడు పరారయ్యాడు.

ఈ క్రమంలో బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్ వి. కురత్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని గుర్తించి ఆగస్టు 24న అరెస్టు చేశారు.

ADVERTISEMENT