LOADING...
AI Videos: మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్‌'పై సైబర్‌ పోలీసుల కేసు
మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్‌'పై సైబర్‌ పోలీసుల కేసు

AI Videos: మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్‌'పై సైబర్‌ పోలీసుల కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో ఏఐతో తయారుచేసిన వీడియోలు, ఫొటోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఏఐ వీడియోలు X (ఎక్స్)లో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేరళ సైబర్ పోలీసులు, సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించేలా రూపొందించబడ్డాయని చెప్పారు. అంతేకాకుండా దేశ ప్రధాని, అలాగే ఎన్నికల కమిషన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా అవి ఉన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ఎన్నికల నిర్వహణపై ప్రతికూల ప్రభావం

ఇవి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ కేసులో భాగంగా ఎక్స్ సంస్థతో పాటు, ఆ ఏఐ వీడియోలను పోస్టు చేసిన యూజర్ ఖాతాపై కూడా తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement