NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్
    తదుపరి వార్తా కథనం
    Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్
    కేరళలో నిపాతో వ్యక్తి మృతి..

    Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 16, 2024
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో నిపా వైరస్ వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    మలప్పురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి, మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు.

    రీజనల్ మెడికల్ ఆఫీసర్ చేసిన డెత్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిపా ఇన్ఫెక్షన్ అనుమానం కలిగిందని, వ్యక్తి నమూనాలను పరీక్షలకు పంపగా, నిపా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆమె వెల్లడించారు.

    సెప్టెంబర్ 09న బెంగళూరు నుంచి వచ్చిన ఈ వ్యక్తి మరణించడంతో, తర్వాతి సమయంలో నిపా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది.

    ఈ మరణం తర్వాత నిఫా ఉన్నట్లు తేలడంతో ఆరోగ్యమంత్రి నేతృత్వంలో అత్యున్నత సమావేశం జరిగింది.

    వివరాలు 

     16 కమిటీలను ఏర్పాటు,151 మంది వ్యక్తులతో కూడిన కాంటాక్ట్ లిస్ట్‌

    ప్రోటోకాల్ ప్రకారం తగిన చర్యలు చేపట్టారు. కోజికోడ్ వైద్య కళాశాల, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) నిర్వహించిన పరీక్షల్లోనూ నిపా వైరస్ పాజిటివ్‌గా తేలింది.

    ఆశ్చర్యకరమైన ఈ పరిణామం నేపథ్యంలో 16 కమిటీలను ఏర్పాటు చేసి, 151 మంది వ్యక్తులతో కూడిన కాంటాక్ట్ లిస్ట్‌ను గుర్తించామని మంత్రి తెలిపారు.

    మరణించిన వ్యక్తి, తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. అతడితో సన్నిహితంగా ఉన్న ఐదుగురికి జ్వరం, ఇతర లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.

    వివరాలు 

    గబ్బిలాలలో నిపా యాంటీబాడీస్

    అంతకుముందు, జూలై 21న నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఒక బాలుడు మరణించాడు. ఇది రాష్ట్రంలో నమోదైన తొలి కేసు.

    2018, 2021, 2023లో కోజికోడ్ జిల్లాలో, 2019లో ఎర్నాకుళం జిల్లాలోనూ నిపా వైరస్ వ్యాప్తి నమోదైంది.

    కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం మరియు ఎర్నాకుళం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా యాంటీబాడీస్ కూడా గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    నిఫా వైరస్

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    కేరళ

    Russia election 2024: రష్యా అధ్యక్ష ఎన్నికలు .. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?  రష్యా
    Kerala: లారీ నుంచి జారిపడ్డ 'బండ రాయి'.. వైద్య విద్యార్థి మృతి.. డ్రైవర్ అరెస్ట్  భారతదేశం
    Lok Sabha 2024: రాహుల్‌ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే? రాహుల్ గాంధీ
    Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు  పినరయి విజయన్

    నిఫా వైరస్

    కేరళను బెంబెలెత్తిస్తోన్న నిఫా వైరస్.. ఇద్దరు మృతి భారతదేశం
    కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఏడు గ్రామాల్లో పాఠశాలలు, బ్యాంకులు మూసివేత  కేరళ
    కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఐదుకు చేరిన కేసులు.. లక్షణాలు ఇవే  తాజా వార్తలు
    కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి.. గబ్బిలాలు, చెట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్న నిపుణులు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025