
Kesineni Nani: వైసీపీ లో చేరనున్న కేశినేని నాని..? జగన్ తో కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం వై.ఎస్.జగన్‌తో సమావేశం కానున్నారు. టీడీపీ తనను పక్కన పెట్టడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు. నాని వైసీపీలో చేరడంపై బుధవారం సాయంత్రం క్లారిటీ రానుంది. కాగా, సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. విజయవాడ నుంచి ఎంపీ టిక్కెట్టు ఇచ్చేది లేదని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. విజయవాడ ఎంపీ టికెట్ మరొకరికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Details
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ
ఇకపై పార్టీ కార్యక్రమంలో పాల్గొనవద్దని చెప్పినట్లు కేశినేని నాని సోషల్ మీడియాలో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు సమ్మతిస్తూ పార్టీ నుంచి తప్పుకున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం,తాను పార్టీలో కొనసాగలేనని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.ముందుగా ఎంపీ పదవికి,ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని తెలిపారు. కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. అయినప్పటికీ కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టీడీపీ తనను పక్కన పెట్టడంతో నాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.