LOADING...
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన 
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షపై కీలక ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 23న నిర్వహించనున్న గ్రూప్-2 మెయిన్ పరీక్షపై ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) స్పష్టతనిచ్చింది. పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య వార్తలను ఖండించింది. పరీక్ష నిర్దేశిత తేదీకే యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఫేక్ వార్తలపై చర్యలు గ్రూప్-2 మెయిన్ పరీక్ష వాయిదా పడిందంటూ హల్‌చల్ చేస్తున్న ఫేక్ న్యూస్‌పై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని హెచ్చరించింది.

Details

పరీక్షా షెడ్యూల్

ఉదయం 10:00 - 12:30: పేపర్-1 మధ్యాహ్నం 3:00 - 5:30: పేపర్-2 అభ్యర్థులు 15 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని సూచించింది. తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్చరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలనీ, అసత్య వార్తలను విస్తరించరాదని సూచించారు.