
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా పారిశ్రామిక విస్తరణ, విద్య, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి రంగాల్లో కీలక ఆమోదాలు లభించాయి.
వివరాలు
పారిశ్రామిక అభివృద్ధికి భూ కేటాయింపులు
ముత్తుకూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కి 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది.
అక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదానీ పవర్ సంస్థకు తాడిమర్రిలో 500 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టుకు,అలాగే కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అనుమతినిచ్చింది.
ఈ భూములు ఒక్కో ఎకరాకు రూ.5 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
వివరాలు
కేబినెట్ ఆమోదించిన ఇతర కీలక అంశాలు
రాష్ట్రవ్యాప్తంగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు కోచింగ్ అందించేందుకు స్టడీ సెంటర్లు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అమరావతిలో లీగల్ యూనివర్సిటీ స్థాపనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్,ఇతర నిత్యావసర వస్తువులను దుకాణాల ద్వారా పంపిణీ చేసే విధానంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
వివరాలు
కేబినెట్ ఆమోదించిన ఇతర కీలక అంశాలు
భోగాపురం వద్ద 500 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనకు మంత్రుల బృందం చేసిన సిఫారసును మంత్రివర్గం ఆమోదించింది.
"ఏపీ లెదర్ ఫుట్‌వేర్ పాలసీ 4.0"కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆమోదించిన 11 సంస్థల ప్రతిపాదనలకు క్యాబినెట్ మద్దతు ప్రకటించింది.
ఈ సంస్థలు పెట్టుబడుల రూపంలో రూ.30 వేల కోట్లు రాబట్టే అవకాశం ఉండగా, దాదాపు 35 వేల ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని అంచనా.