
Ajit Doval: భద్రతా రంగంలో కీలక నిర్ణయాలు.. ప్రధాని మోదీతో అజిత్ డోభాల్ కీలక భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను డోభాల్ మోదీకి వివరించినట్లు తెలిసింది.
'ఆపరేషన్ సిందూర్' అనంతరం రెండు దేశాల మధ్య మళ్లీ దాడులు జరిగే స్థితి ఏర్పడిన నేపథ్యంలో ప్రధానితో వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, త్రివిధ దళాధిపతులతో కూడా డోభాల్ సమావేశమయ్యారన్న సమాచారం బయటకు వచ్చింది.
Details
పాక్ కు ధీటుగా బదులిస్తున్న భారత్
దేశ భద్రతాసంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పాక్ దాడుల విషయానికి వస్తే.. జమ్మూ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు.
శుక్రవారం రాత్రి నుంచి పాక్ రెచ్చిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, భారత బలగాలు కూడా దీటుగా స్పందించి, కవ్వింపులకు గట్టిగా తిప్పికొడుతున్నాయని వెల్లడించారు.
ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రతను సమీక్షించేందుకు ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు డోభాల్ చర్చలు జరపడం కీలకంగా మారింది.