
TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ సుపథం టికెట్ ద్వారా ఉద్యోగులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. అలాగే, తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని పేర్కొన్నారు.
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో బోర్డు పలు కీలక తీర్మానాలను చేసింది.
Details
తితిదే బోర్డు చేసిన ముఖ్య తీర్మానాలివే
1. అంతర్జాతీయ ఆలయాల నిర్మాణం: ఇతర దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు.
2. ఆస్తుల పరిరక్షణ: తితిదే ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
3. న్యాయపరమైన వివాదాలు: తితిదే భూముల న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.
4. హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: తితిదేలో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం.
5. రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు: వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు.
6. గ్రామాల ఆలయాలకు ఆర్థిక సాయం: అర్ధాంతరంగా ఆగిపోయిన గ్రామాల ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం.
Details
తితిదే బోర్డు చేసిన ముఖ్య తీర్మానాలివే 1/2
7. అక్రమాల విచారణ: శ్రీనివాస సేవా సమితి పేరుతో కైంకర్యాల సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం.
8. పునరుద్ధరణ: తితిదే మూలాలున్న ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం.
9. అనధికార హాకర్ల తొలగింపు: తిరుమలలో అనధికార హాకర్ల తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు.
10. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయిస్తూ, పూర్వ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం.
11. తితిదే బడ్జెట్: రూ.5,258.68 కోట్లతో 2025-26 బడ్జెట్‌కు ఆమోదం.
12. గదుల ఆధునీకరణ: రూ.772 కోట్లతో తిరుమల గదుల ఆధునీకరణకు నిర్ణయం.
తితిదే బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు భక్తులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి.