తదుపరి వార్తా కథనం
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 27, 2025
02:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ నేత కేసీఆర్ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంది. ఈ కేసు భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును గంటల తరబడి విచారించింది. పలువురు ప్రముఖ నేతల నుండి కూడా సిట్ ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సిట్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్ మాజీ OSD
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్ మాజీ OSD పెంటపర్తి రాజశేఖర్ రెడ్డి pic.twitter.com/w23flLHp6w
— Tharun Reddy (@Tarunkethireddy) November 27, 2025