LOADING...
Rahul Gandi: ఎన్నికల అధికారికి కీలక పదవి.. బీజేపీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
ఎన్నికల అధికారికి కీలక పదవి.. బీజేపీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

Rahul Gandi: ఎన్నికల అధికారికి కీలక పదవి.. బీజేపీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో సువెందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన మనోజ్ అగర్వాల్‌ను, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వంటి అత్యున్నత పదవిలో నియమించడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఈ నియామకంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. దీనిని "బీజేపీ-ఈసీ చోర్ బజార్"గా అభివర్ణించారు. ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి పనిచేశాయనే ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. "దొంగతనం ఎంత పెద్దదైతే, దానికి లభించే ప్రతిఫలం కూడా అంత పెద్దదిగా ఉంటుందంటూ విమర్శలు గుప్పించారు.

వివరాలు

ఈ ఆరోపణలను ఖండించిన బీజేపీ

ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తికి ఇంత కీలక పదవి ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ నియామకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి ప్రభావితం చేశాయని, అందుకు ఈ నియామకమే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు తలెత్తాయని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది. గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా తనకు అనుకూలమైన అధికారులకు కీలక పదవులు ఇచ్చిందని, మనోజ్ అగర్వాల్ నియామకం పూర్తిగా అర్హతల ఆధారంగానే జరిగిందని బీజేపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.

Advertisement