Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్‌లో ఫ్లైట్‌ను సీజ్ చేసిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేశారు.
గంటల పాటు ఫ్లైట్‌ను చుట్టుముట్టి, అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కాంలో నిందితులు ఇదే ఫ్లైట్‌లో దుబాయ్‌కి పారిపోయారు.
15 రోజుల క్రితం దుబాయ్ వెళ్లి, తర్వాత అదే చార్టర్డ్ ఫ్లైట్‌ను తిరిగి హైదరాబాద్‌కు పంపించారు.
అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఈ విమానం రాకను ముందుగానే పసిగట్టిన ఈడీ అధికారులు, వెంటనే చర్యలు తీసుకుని అదుపులోకి తీసుకున్నారు.
Details
ఫాల్కన్ స్కామ్.. 1700 కోట్ల కుంభకోణం
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామంటూ రూ.1700 కోట్లు వసూలు చేసిన ఫాల్కన్ కంపెనీ, పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామని ప్రచారం చేసింది.
ఇది నమ్మిన ప్రజలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతోనే కీలక సూత్రధారి అమర్‌దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేశాడు.
సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగానే, అమర్‌దీప్‌తో పాటు 10 మంది నిందితులు విదేశాలకు పారిపోయారు.
ఫాల్కన్ కంపెనీ సీఈవో, సీవోవో కుటుంబాలతో కలిసి అమర్‌దీప్ ఎస్కేప్ అయ్యాడు.
అమర్‌దీప్‌తో పాటు 15 మందిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.