తదుపరి వార్తా కథనం
TGPSC Group 2 Case: గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 27, 2025
12:31 pm
ఈ వార్తాకథనం ఏంటి
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి TGPSC 2019లో సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆ సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో, కేసును పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ తాజా నిర్ణయం ఇచ్చింది. ఈ తీర్పుతో 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించినట్టైంది.