Page Loader
KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు
కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు

KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) కాళేశ్వరం కమిషన్‌ (Kaleshwaram Commission) ఎదుట హాజరయ్యే తేదీ మార్చారు. తొలుత ఈ నెల 5న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈ నెల 11వ తేదీకి మారుస్తూ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. తాజా షెడ్యూల్ ప్రకారం, జూన్‌ 11న కేసీఆర్‌ విచారణకు హాజరుకానున్నారు.