ఖలీస్థాన్ ఎఫెక్ట్ : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు Z కేటగిరి భద్రత
భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఖలిస్థానీ ఉగ్రవాదులు పోస్టర్లు వేసిన సందర్భంగా ఆయన భద్రతను Y నుంచి Z కేటగిరీకి పెంచింది. ఇప్పటిదాకా దిల్లీ పోలీసుల భద్రతలో ఉన్న కేంద్ర మంత్రి జైశంకర్ కు తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) బలగాలు భారీ భద్రత కల్పిస్తాయి. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూడు షిఫ్టుల్లో డజనుకుపైగా సాయుధ కమాండోలు దేశవ్యాప్తంగా 24 గంటల పాటు రక్షకులుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వీవీఐపీ భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ప్రధానికి, Z+తో కూడిన ఎస్పీజీ సెక్యూరిటీ అందిస్తున్నారు.