Loading...
Khelo India: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌.. లోగో ఆవిష్కరించిన ప్రధాని మోదీ!
తెలంగాణలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌.. లోగో ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

Khelo India: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌.. లోగో ఆవిష్కరించిన ప్రధాని మోదీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 8వ ఎడిషన్‌కు సంబంధించిన లోగోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి ప్రధానిని కలిశారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌కు హాజరుకావాలని మోదీని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల 8వ ఎడిషన్‌కు తెలంగాణ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనుంది.

వివరాలు

ఐదు నగరాల్లో పోటీలు

2026 డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ క్రీడా సంబరం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 6,000 మందికి పైగా యువ అథ్లెట్లు, 1,800 మంది సహాయక సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు.

హైదరాబాద్‌ ప్రధాన వేదికగా 22 మెడల్‌ స్పోర్ట్స్‌ నిర్వహించనున్నారు.

బషీర్‌బాగ్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్టేడియం కాంప్లెక్స్‌, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితర ప్రాంగణాల్లో పోటీలు జరగనున్నాయి. మిగతా క్రీడలను ఐదు నగరాల్లో నిర్వహిస్తారు.

ఖమ్మం: ఆర్చరీ

హనుమకొండ: అథ్లెటిక్స్‌

కరీంనగర్‌: జూడో

నిజామాబాద్‌: టేబుల్‌ టెన్నిస్‌

మహబూబ్‌నగర్‌: కబడ్డీ

ఈ ఎడిషన్‌లో మొత్తం 27 పోటీ క్రీడలు, ఒక డెమాన్‌స్ట్రేషన్‌ స్పోర్ట్‌ ఉండనున్నాయి. సాఫ్ట్‌బాల్‌ తొలిసారిగా పోటీ క్రీడగా చేరడం విశేషం.

వివరాలు

ఖేలో ఇండియాలో నిర్వహించే క్రీడలివే..

ఈసారి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, సైక్లింగ్‌, ఫెన్సింగ్‌, ఫుట్‌బాల్‌, గత్కా, జిమ్నాస్టిక్స్‌, హాకీ, జూడో, కబడ్డీ

కలరిపయట్టు, ఖో-ఖో, మల్లఖంబ్‌, రోయింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, సాఫ్ట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌

టెన్నిస్‌, థాంగ్‌-తా, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, యోగాసనాలు నిర్వహించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా మహారాష్ట్ర

గతేడాది బిహార్‌లో జరిగిన 7వ ఎడిషన్‌లో మహారాష్ట్ర 58 స్వర్ణ పతకాలతో ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఈసారి కూడా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. డిసెంబర్‌ 11న గచ్చిబౌలిలో ప్రారంభోత్సవం జరగనుంది.

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహణతో తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు.. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు లభించనున్నాయి.

ADVERTISEMENT