
Hyderabad: హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమానం.. ప్రారంభించిన కేఎల్‌ఎం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్ షిపోల్ విమానాశ్రయానికి కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీస్‌లో మొదటి విమానం బుధవారం ఉదయం బయలుదేరింది.ఈ రూట్‌లో కేఎల్‌ఎం బోయింగ్ 777-200ఈఆర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. వారానికి మూడు సార్లు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.ఇప్పటి వరకు ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమాన సర్వీసులు బెంగళూరు,న్యూఢిల్లీ,ముంబయి నుంచి అందుబాటులో ఉన్నాయి. "హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.ఇది భారతదేశం ఫార్మా రంగంలో ప్రధాన కేంద్రంగా మారింది.అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.ఇలాంటి ప్రాముఖ్యమైన నగరానికి నేరుగా విమాన సేవలను అందించడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం"అని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ అన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కి విమానం
Some pictures from yesterday's (re)launch of KLM's direct flights between Amsterdam & Hyderabad! ✈️
— Hyderabad Mojo (@HyderabadMojo) September 3, 2025
Starts off with a 3x weekly frequency on a Boeing 777. pic.twitter.com/ricGQ3Tycx