Telangana: తెలంగాణ ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ శాసనమండలి సభ్యులుగా విద్యావేత్త ఎం కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి పి శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం రాభాకర్, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కౌన్సిల్ చైర్మన్ జి సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కోదండరామ్ తన పేరును ప్రతిపాదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎందరో ప్రజల త్యాగాల వల్లే తాను ఈ స్థానం సాధించానన్నారు.
కోదండరామ్, చంద్రశేఖర్ రావు మధ్య విభేదాలు
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి కోదండరామ్ సారథ్యం వహిస్తుండగా,అమీర్ అలీఖాన్ ప్రముఖ ఉర్దూ దినపత్రిక 'సియాసత్'కు న్యూస్ ఎడిటర్‌గా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర మాజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన కోదండరాం, టీఆర్‌ఎస్‌తో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కోదండరామ్,టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు మధ్య విభేదాలు వచ్చాయి. అమీర్ అలీ ఖాన్ 'సియాసత్' చీఫ్ ఎడిటర్ జాహిద్ అలీ ఖాన్ కుమారుడు,అయన గతంలో టీడీపీ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. 2009లో హైదరాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.