Parigela muralikrishna: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్యెల్యే
కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు.తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్యెల్యే,వైసీపీ నేత పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పరిగెల 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓడిపోగా,వైసీపీలో చేరారు.2019లో వైసిపి సీటు ఆశించినప్పటికీ అప్పటి సమీకరణాల కారణంగా సీటు దక్కలేదు. ప్రస్తుతం 2024ఎన్నికలలో అయినా సీటు వస్తుందని ఆశించినప్పటికీ రాకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. కాగా,మంగళవారం నందికొట్కూరు ఎమ్యెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.