Page Loader
Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి 
Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి

Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2024
01:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ అధిష్ఠానం మంత్రి జోగి రమేశ్‌కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి,పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు. తనకి ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చెయ్యడం గాని,బెదిరించడం గాని చేతకాదని,అందుకే నాకు సీటును నిరాకరించారేమోనని అనుకుంటున్నాని ఆయన అన్నారు. వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. ఉత్తి మాటలే అన్నారు. ప్రస్తుతం వైసీపీ గన్నవరంలో గెలిచే పరిస్థితి లేకే తనని అక్కడి వెళ్లమన్నారని అన్నారు. బీసీ నేతలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదని అన్నారు.

Details 

ఈ నెల 18న టిడిపిలోకి 

మరోవైపు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు లేదా పెనమలూరు నియోజకవర్గాల సీటును ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. గత మంగళవారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు 'రా.. కదలి రా' బహిరంగ సభ జరగనుంది. ఈ వేదికపై పార్థసారథి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.