LOADING...
#NewsBytesExplainer: నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పున్న కైలాష్ మధ్య కొత్త వివాదం

#NewsBytesExplainer: నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పున్న కైలాష్ మధ్య కొత్త వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన పున్నా కైలాష్ నేతను తక్షణం పదవీ నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేశారు. ఈ లేఖలో, డీసీసీ అధ్యక్షుడిని నియమించిన ప్రక్రియను సవివరంగా చూపిస్తూ, వెంటనే పదవీ నుండి తొలగించాలని చెప్పడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది.

వివరాలు 

తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన విద్యార్థి నేత పున్నా కైలాష్ 

పున్నా కైలాష్ నేత పద్మశాలి సామాజిక వర్గం నేత. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న సమయంలో, OUJAC నాయకుడిగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత, సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకుని కాంగ్రెస్‌లో చేరారు. మునుగోడు ఎమ్మెల్సీ టికెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించగా, అవకాశం దొరకలేదు. తర్వాత భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ విజయం పొందలేరు. చివరికి, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు.

వివరాలు 

గతంలో కోమటిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు 

మునుగోడు ఉపఎన్నిక సమయంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదని పున్నా కైలాష్ నేత తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శల్లో కోమటిరెడ్డి తో బాటు కుటుంబాన్ని కూడా పేర్కొన్నారు. ఈ పరిణామాల కారణంగా, ఇప్పుడు అదే కారణాన్ని చూపుతూ, కోమటిరెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయన పదవీ తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయం తరువాత, తమకు డీసీసీ పదవిని ఆశిస్తున్నా కోమటిరెడ్డి అనుచరులు కూడా.. సీరియస్ అవుతున్నారు కొందరు 'కోమటిరెడ్డి వద్ద అటువంటి అధికారం ఉందా?' అని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల కోమటిరెడ్డి నియామకాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

డీసీసీ నియామక ప్రక్రియ - రేవంత్ బాధ్యతకాదు

డీసీసీ అధ్యక్షుల్ని నియమించడానికి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఎదుట కసరత్తు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ నేతృత్వంలోనే ఈ ప్రక్రియ జరిగింది. రేవంత్ ఒక్కడి మాటతోనే నియామకాలు జరగడంలేదు. అయినప్పటికీ, కోమటిరెడ్డి రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు. నిజానికి పార్టీ పరమైన అంశంలో ఆయన విజ్ఞప్తి చేసినా.. హెచ్చరించినా భాద్యుడిని చేయాల్సింది పీసీసీ చీఫ్‌ను. కానీ రేవంత్ ను బాధ్యుడ్ని చేయడం ఆయన వ్యూహమేనని భావిస్తున్నారు.