Krishna Water Dispute: కృష్ణా జలాల పంపిణీపై మళ్లీ వివాదం.. ఏపీ అదనపు డిమాండ్‌కు నో చెప్పిన తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)ఆధ్వర్యంలో జరిగిన త్రీ మెంబర్ కమిటీ సమావేశంలో నీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే 9 టీఎంసీల నీటిని కోరిన ఆంధ్రప్రదేశ్.. తాజాగా మరో 10టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని ప్రతిపాదించింది. దీంతో సమావేశంలో నీటి పంపిణీ అంశంపై చర్చ వాడీవేడిగా సాగింది. ఏపీ చేసిన అదనపు నీటి డిమాండ్‌ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మరో 10టీఎంసీల నీటిలో ఒక్క చుక్క కూడా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తాగునీటి అవసరాలు ఉన్నందున అదనపు కేటాయింపులకు అంగీకరించలేమని తెలంగాణ ప్రతినిధులు తేల్చి చెప్పారు.
వివరాలు
మూడు నెలల అవసరాలకు 30 టీఎంసీలు కావాలి
దీంతో ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు రానున్న మూడు నెలల పాటు రాష్ట్రంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు 30 టీఎంసీల నీరు అవసరమని తెలంగాణ కమిటీ ముందు ప్రతిపాదించింది.
వేసవి కాలంతో పాటు వచ్చే మూడు నెలల్లో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నీటిని కేటాయించాలని కోరింది.
వివరాలు
మూడు నెలల అవసరాలకు 30 టీఎంసీలు కావాలి
అటు ఆంధ్రప్రదేశ్ అదనంగా 10 టీఎంసీల నీరు కావాలని పట్టుబట్టడం,ఇటు తెలంగాణ 30 టీఎంసీల నీటి అవసరాన్ని ప్రస్తావించడంతో సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో ఉదయం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే చర్చలను వాయిదా వేశారు.
నీటి కేటాయింపులపై మరింత లోతుగా చర్చించి నిర్ణయానికి రావడానికి త్రీ మెంబర్ కమిటీ మధ్యాహ్నం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.