Page Loader
Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 
Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్

Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 22, 2024
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారికి శిక్ష పడే అవకాశాలు లేవు. ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ నిర్ణయంపై మాజీమంత్రి,బీఆర్ఎస్ నేత కేటిఆర్ స్పందించారు. అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై క్రిమినల్ కేసులు పెట్టకపోవడం అవమానకరమని,పూర్తిగా ఆమోదయోగ్యం కాదని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదించి జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Details 

పోలీస్ కారు ఢీకొని జాహ్నవి కందుల మృతి 

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెంటనే జోక్యం చేసుకోని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోరారు. జాహ్నవి కందులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో, జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను ఆయన కోరారు. అమెరికా పోలీసు అధికారులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆందోళనను, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) అనే విద్యార్థిని జనవరి 25, 2023న సియాటిల్ పోలీస్ కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేటిఆర్ చేసిన ట్వీట్