సూట్ కేసు సత్యనారాయణ వ్రత పీఠాన్ని చూశారా.. వడ్రంగి కళా నైపుణ్యానికి మంత్రి కేటీఆర్ ఫిదా
తెలంగాణలో ఓ వడ్రంగి తన కళా నైపుణ్యంతో మంత్రి కేటీఆర్ అభిమానాన్ని చురగొన్నాడు. సూట్ కేసులో పట్టేంత మండపాన్ని తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతపీఠాన్ని ఓ చెక్క పెట్టె రూపంలో ఈ కళాశిల్పి సృష్టించాడు. దాన్నే మళ్లీ విడివిడిగా చేసి తిరిగి వ్రత పీఠంలా అమర్చిన విధానానికి కేటీఆర్ ఫిదా అయ్యారు. రాగుల సంపత్ అనే వేరే వ్యక్తి సదరు వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ కళాకారుడికి సాయం చేయాలని కోరారు. ఈ వీడియోను చూసిన మంత్రి కార్పెంటర్ నైపుణ్యానికి అబ్బురపడ్డారు. అద్భుత నైపుణ్యంతో కళను సృష్టించిన వడ్రంగికి సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.