Maha Kumbh 2025: కుంభమేళా అనవసరం.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనకు రైల్వే తప్పిదమే కారణమని, దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తొక్కిసలాట ఘటన చాలా కలవరపాటును కలిగిస్తోందని, కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదనే విషయాన్ని ఆ ఘటన బహిర్గతం చేస్తోందన్నారు.
దీనికి బాధ్యత వహించిన రైల్వే మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఇది పూర్తిగా రైల్వేల వైఫల్యమే అని లాలూ వ్యాఖ్యానించారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు లెక్కకు మిక్కిలిగా ప్రజలు తరలివస్తుండటంపై అడిగినప్పుడు "కుంభ్‌కు అర్థమే లేదు, ఇది పనికిరానిదని సమాధామిచ్చారు.
Details
లాలూ వ్యాఖ్యలపై బీజేపీ ఆక్షేపణ
కుంభమేళాకు అర్థమే లేదంటూ లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందూ మతం పట్ల ఆర్జేడీ ఆలోచనా విధానానికి లాలూ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ బీహార్ విభాగం ప్రతినిధి మనోజ్ శర్మ అన్నారు.
బుజ్జగింపు రాజకీయాల వల్లే లాలూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆర్జేడీ నేతలు హిందువుల మనోభావాలను అవమానించడం పరిపాటిగా మారిందని విమర్శించారు.
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 14,15 ఫ్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లాలూ
#WATCH | Stampede at New Delhi Railway Station | Patna, Bihar: Former Union Railway Minister and RJD Chief Lalu Prasad Yadav says, "The incident is very unfortunate and I offer my condolences to the victims. This is a mismanagement by the Railway that led to the loss of so many… pic.twitter.com/83icLBvtSm
— ANI (@ANI) February 16, 2025