Loading...
Ladakh: లద్దాఖ్‌లో కొత్త జిల్లా.. ఎనిమిదో జిల్లాగా సంకూను ప్రకటించిన ఎల్జీ సక్సేనా
లద్దాఖ్‌లో కొత్త జిల్లా.. ఎనిమిదో జిల్లాగా సంకూను ప్రకటించిన ఎల్జీ సక్సేనా

Ladakh: లద్దాఖ్‌లో కొత్త జిల్లా.. ఎనిమిదో జిల్లాగా సంకూను ప్రకటించిన ఎల్జీ సక్సేనా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్‌లో కొత్త జిల్లాగా సంకూ ఏర్పాటైంది.దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరింది. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శుక్రవారం సంకూను ఎనిమిదో జిల్లాగా ప్రకటించారు. ఈ జిల్లాలో సుమారు 40,548 మంది జనాభా ఉన్నారు. సంకూను జిల్లాగా ప్రకటించడం స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజుమన్‌-ఎ-సాహిబ్‌ జమాన్‌ సంస్థతో పాటు ఈ నిర్ణయం కోసం కృషి చేసిన పలువురు ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే లఢఖ్‌లో షామ్‌, నుబ్రా, చాంగ్తాంగ్‌, జన్స్కార్‌, ద్రాస్‌ జిల్లాలను ఏర్పాటు చేశారు.

వివరాలు 

లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా ఎలా ఏర్పడింది?

తాజాగా సంకూను జిల్లాగా ప్రకటించడంతో మొత్తం జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది.

అనంతరం జమ్ముకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అప్పటి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

అవే జమ్ముకాశ్మీర్‌, లఢఖ్‌. ఈ నిర్ణయంతో జమ్ముకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగ హోదా ముగిసింది.

వివరాలు 

ఐదు జిల్లాల ఏర్పాటు

2019లో జమ్ముకాశ్మీర్‌ నుంచి విడిపోయి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన లఢఖ్‌లో తొలుత లేహ్‌, కార్గిల్‌ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి.

అయితే, పరిపాలనను మరింత సులభతరం చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసే లక్ష్యంతో ఈ ఏడాది లెఫ్టినెంట్ గవర్నర్ యంత్రాంగం మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేసింది.

తాజాగా సంకూ ఎనిమిదో జిల్లాగా చేరింది. ప్రస్తుతం లఢఖ్‌ ప్రాంతంలో సుమారు 3.5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు.

ADVERTISEMENT