Rahul Gandhi: 'విదేశాంగ శాఖలో గందరగోళం'.. రూబియో పర్యటనపై కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి పర్యటనకు సంబంధించి భారత విదేశాంగ శాఖ అధికారులకు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం నెలకొందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ను ఉద్దేశించి పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూబియో తన సిబ్బందిని ముంబయికి పిలిపించుకున్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనకు సంబంధించి భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ గురువారం కీలక వివరాలు వెల్లడించారు. రూబియో ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతారని తెలిపారు.
వివరాలు
'ఎక్స్' వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ
ఈ సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పాల్గొంటారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు.
''రూబియో తన సిబ్బందిని ముంబయికి రావాలని ఆదేశించారు. మోదీజీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మీ అధికారులు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. వారికి మీరు వివరించాలేమో..! లేదంటే నన్ను చెప్పమన్నా సరే..!'' అని రాహుల్ గాంధీ పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా జైశంకర్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్
Mr Rubio has summoned his employee to Mumbai.
— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2026
Modi ji, your officials in the External Affairs Ministry are confused about what's going on.
You might want to explain.
Unless, of course, you want me to.
వివరాలు
వచ్చే వారం భారత్కి మార్కో రూబియో
మార్కో రూబియో వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ యూనిట్ను సందర్శించనున్నారు.
అనంతరం ముంబయిలో పలువురు వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతారు.
ఈ నేపథ్యంలో రూబియో, జైశంకర్ మధ్య కూడా భేటీ జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ సమావేశంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ అభివృద్ధిలో పరస్పర సహకారం తదితర అంశాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.