Page Loader
LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 
కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3 గెలుపొందింది, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

LAHDC-Kargil Poll: కాంగ్రెస్ 5 సీట్లు, ఎన్‌సీ 3, బీజేపీ ఒక సీటు కైవసం.. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు 

వ్రాసిన వారు Stalin
Oct 08, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC)- కార్గిల్‌లోని 26 స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ ఐదు సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్ (మూడు), బీజేపీ (ఒకటి) స్థానాల్లో గెలిచాయి. రాంబీర్‌పోవా, పష్కం, చోస్కోర్, చిక్కాన్, తైసురు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. భీంబట్, పదం, యువర్‌బల్టాక్‌లను నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది. ఇక బీజేపీ స్టాక్‌చయ్ ఖంగ్రాల్‌లో జయకేతనం ఎగరేసింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అంటే.. 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్ నుంచి లద్దాఖ్ విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత కార్గిల్‌లో జరుగుతున్న తొలి హిల్ కౌన్సిల్ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.

బీజేపీ

ఎన్నికల బరిలో 85 మంది 

LAHDC ఎన్నికల బరిలో 85మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో 25మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్‌సీ 17మందిని, కాంగ్రెస్ 22 మందిని పోటీలో నిలబెట్టింది. మరోవైపు బీజేపీ నుంచి 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కౌన్సిల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) కూడా వినియోగించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 278 పోలింగ్‌ కేంద్రాల్లో 99 సెన్సిటివ్‌గా, 114 పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌సెన్సిటివ్‌గా గుర్తించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి ఇద్దరు కౌన్సిలర్లు ఆ తర్వాత బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ సభ్యుల సంఖ్య 3కు చేరుకుంది.