Amaravati: అమరావతిలో భూకేటాయింపులు.. కీలక భేటీలో మంత్రుల కమిటీ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది.
అమరావతి రాజధానిలో సంస్థలకు భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేశ్ హాజరయ్యారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో నిర్మాణాలు ప్రారంభించేందుకు వేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, భూకేటాయింపులపై ఇవాళ్టి భేటీలో కీలక చర్చలు జరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో భూమి కేటాయింపుల కోసం కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ సంస్థలు తమ ప్రతిపాదనలు పంపించాయి.
Details
అధికారిపై ప్రకటన వెలువడే అవకాశం
ఇప్పటివరకు దాదాపు 30కిపైగా సంస్థలు భూకేటాయింపు కోరాయి.
ఈ ప్రతిపాదనలను మంత్రుల కమిటీ పరిశీలించనున్నది. ఆయా సంస్థలకు ఎంత భూమి కేటాయించాలి? ఏ విధంగా భూకేటాయింపు చేయాలి? అనే విషయాలపై సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ భేటీ తర్వాత భూకేటాయింపులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.