Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దులో ల్యాండ్ మైన్ పేలుడు.. ఆరుగురు జవాన్లకు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా భవానీ సెక్టార్ వద్ద మంగళవారం జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఆరుగురు భారత జవాన్లు గాయపడ్డారు.
భారత్-పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో, జవాన్లు గస్తీ నిర్వహిస్తుండగా, అనుకోకుండా ఒక మందుపాతర పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
సున్నితమైన ప్రాంతంలో గస్తీ చేస్తున్న సమయంలో ఒక జవాను పొరపాటున మందుపాతరపై కాలు వేయడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Details
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లు
గాయపడిన వారిని వెంటనే వైద్య సహాయం అందించి, సమీప వైద్య కేంద్రానికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ ప్రాంతం గతంలో అనేక ఘర్షణలకు కేంద్రంగా మారింది.
అక్కడ ఉగ్రవాదులు సరిహద్దు కంచెను దాటేందుకు ప్రయత్నాలు, పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది.
ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నా గస్తీ సమయంలో మందుపాతరపై కాలు వేయడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.