Page Loader
Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?
భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో 10 శాతం పెంపు

Land Registrations: భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.. కృష్ణా జిల్లాలో ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో ధరలు పెరగాలని అంచనా వేసినా, పెద్దగా మార్పులు జరగలేదు. విజయవాడతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం విజయవాడ గ్రామీణంలో 20-30 శాతం పెంచగా, ప్రస్తుతం 5 శాతమే పెరిగింది. ధరల పెంపుపై తుది జాబితా సిద్ధం చేసి, అది వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా పెంచిన భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు అస్తవ్యస్తంగా ఉండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా స్వల్పంగా పెంచింది.

Details

విజయవాడలో 8 శాతం పెరిగింది

విజయవాడలో గరిష్ఠంగా 8 శాతం పెరిగింది, కృష్ణా జిల్లాలో 10 శాతం పెంచారు. ఫిబ్రవరి 1 నుంచి భారీ ధరలు పెరిగిపోతాయనే ప్రచారంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిలాడిపోయాయి. గాంధీనగర్, గుణదల, పటమట, నున్న, ఇబ్రహీంపట్నం కార్యాలయాల్లో నిత్యం 100-150 రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ సోమ, మంగళవారాల్లో 2,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతంలో 3 నెలల ఒప్పందాలు చేసిన వారు వాటిని రద్దు చేసుకుని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. విజయవాడ నగర పరిధిలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో 4-8 శాతం, విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో 5 శాతం, ఆటోనగర్, బెంజిసర్కిల్‌ వరకు 7 శాతం పెంచారు.

Details

 ఎకరం ధర రూ.7 కోట్లు

కానూరు, పెనమలూరు, కంకిపాడు వరకు 5-10 శాతం పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. నున్న, జక్కంపూడి, పి.నైనవరం ప్రాంతాల్లో ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉండగా, ఇక్కడ 10-15 శాతం పెరుగుతుందని భావించినా, 5 శాతానికే పరిమితమైంది. గుడివాడ, కంకిపాడు ప్రాంతాల్లో 10 శాతం వరకు పెంచారు. మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 5 శాతం పెరగనున్నాయి. తాడిగడప, కొండపల్లి వంటి మున్సిపాలిటీల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో 10 శాతం పెరిగింది. నగర పంచాయతీ పరిధిలో మాత్రం 5 శాతం మాత్రమే పెరిగింది.