తదుపరి వార్తా కథనం

MUDA scam case: ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య చుట్టు బిగుస్తున్న ఉచ్చు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 05, 2024
12:03 pm
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది.
వందల కోట్ల రూపాయల విలువైన ఈ కుంభకోణంలో ఆయన పాత్ర గురించి ముఖ్యమైన ఆధారాలు బయటపడ్డాయి.
ఈ నేపథ్యంలో, ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సిద్ధమవుతోంది.
సీఎం అక్రమాలకు సంబంధించి పిటిషనర్ స్నేహమయి కృష్ణ చేసిన ఫిర్యాదుల ఆధారంగా,ఈడీ అధికారులు ఆయన నగదు వ్యవహారాలు,హవాలా కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.
ఈడీ,తమకు లభ్యమైన ఈ ఆధారాలను ఉటంకిస్తూ కర్ణాటక లోకాయుక్తకు లేఖ రాసింది.
ముడా కేసులో సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు,ఆయన అనుచరులు అనధికృతంగా కట్టబెట్టిన స్థలాలకు సంబంధించి కూడా ఈడీ ఆధారాలు సేకరించింది.
ఆర్‌టీఐ కార్యకర్త గంగరాజు కూడా ఈడీకి కీలకమైన ఆధారాలను సమర్పించారు.