Page Loader
Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు! 
విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు!

Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దుమ్ము తుఫాను ఎక్కువైంది. దీనికి తోడు విపరీతమైన ఈదురుగాలుల కారణంగా రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇండిగో విమానం 6ఈ 6313 ల్యాండింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. పెరిగిన గాలి వేగం, తుఫాను పరిస్థితుల మధ్య పైలట్ ముందుజాగ్రత్తగా విమానాన్ని ఢిల్లీ అంతరిక్ష పరిధిలో వృత్తాకారంలో తిప్పుతూ, పరిస్థితులు మెరుగవ్వడానికి వేచి చూశారు. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వెలువడింది. ఆ వీడియోలో విమానం బయట అల్లకల్లోల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

Details

దిల్లీ విమానంలో సురక్షితంగా ల్యాండింగ్

వాతావరణం కొద్దిగా శాంతించిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి ల్యాండింగ్‌కు అనుమతి లభించడంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ వరకు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన గాలులు కొనసాగాయి. ఇక మే నెల చివరి మూడు రోజులలో ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేసవిలో వేడిని ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానం