Page Loader
Shakti App: 'శక్తి' యాప్‌ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
'శక్తి' యాప్‌ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు

Shakti App: 'శక్తి' యాప్‌ ఆవిష్కరణ.. మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 08, 2025
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన, ఈ యాప్‌తో పాటు చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే చేనేత రథాన్ని, ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ప్రారంభించారు. శక్తి యాప్‌ ప్రత్యేకతలు ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్ అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ యాప్‌ను రూపొందించింది. మహిళలు ఆపద సమయంలో తక్షణ సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Details

ఎలా పనిచేస్తుందంటే

SOS బటన్ వన్ టచ్‌తోనే పోలీసులను అలర్ట్ చేయవచ్చు. Shake Trigger/Hand Gesture SOS యాప్‌ను ఓపెన్ చేయకుండానే, చేతిని కదిపి అలర్ట్ పంపే అవకాశం. లైవ్ ట్రాకింగ్, ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్ 10 సెకన్ల ఆడియో/వీడియో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పంపుతుంది భద్రతా అధికారుల తక్షణ స్పందన. శక్తి యాప్‌లో కీలక ఫీచర్లు ఫిర్యాదు నమోదు తప్పిపోయిన పిల్లల సమాచారాన్ని రిపోర్ట్ చేయడం అక్రమ కార్యకలాపాలపై ఫిర్యాదు భద్రతతో కూడిన నైట్ షెల్టర్లు, సురక్షిత ప్రయాణానికి మార్గదర్శకం పోలీసు అధికారుల వివరాలు & వాట్సాప్ గవర్నెన్స్ అత్యవసర కాంటాక్ట్ డిటెయిల్స్

Details

 మహిళల భద్రతపై సీఎం హెచ్చరిక 

ఈ యాప్ ఆడబిడ్డల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలపై దాడి చేసే వారిపై తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీ చివరి రోజు అవుతుంది అంటూ కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.